Atchyuth - అచ్యుత్















---------------------------------------------------------------------------------------------------
  • అచ్యుత్ తెలుగు దూరదర్శిని మరియు సినిమాలలో అనతికాలంలో మంచి పేరు సంపాదించిన నటుడు.
కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోజుల నుంచి నటనపై ఆసక్తి చూపారు. 1983లో రెండేళ్ళు హైదరాబాదు లోని మధుఫిలిం శిక్షణా సంస్థలో నటనలో శిక్షణ పొందారు. 1986లో ఇంధ్ర ధనస్సు అనే దూరదర్శన్ సీరియల్ లో తొలిసారినటించారు. తరువాత 'వెన్నెల వేట', 1988లో 'హిమబిందు', 'ప్రేమ అంటే ఇదే' సీరియల్స్ లోనూ, 1989లో 'మిస్టర్బ్రహ్మానందం', 'ఇదెక్కడైనా ఉందా' అనే సీరియల్స్ లో నటించి ఎంతో పేరు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా రంగంలో ప్రవేశించి 1991లో జంధ్యాల దర్శకత్వంలోని ప్రేమ ఎంత మధురం మరియు 1992లో బి.సి.శేఖర్ దర్శకత్వంలోని 'పట్టుదల ' సినిమాలలో నటించారు.
  • వీరి కృషికి గుర్తింపుగా 1990లో జాతీయ స్థాయిలో 'జయసేన్ అవార్డు' అందుకున్నారు. హిమబిందు మరియుమిస్టర్ బ్రహ్మానందంలో అతని నటనకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. 1990 సంవత్సరంలోప్రతిష్టాత్మకమైన నంది అవార్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందుకున్నారు.
  • వీరు 2003 సంవత్సరంలో అకాలమరణం చెంది దూరదర్శినికి ఎంతో లోటు మిగిల్చారు.
సినిమాలలో
  • * డాడీ (2001) .... రమేష్
  • * ఎదురులేని మనిషి (2001)
  • * కౌరవుడు (2000) .... రాహుల్
  • * తమ్ముడు (1999) .... చక్రి
  • * బావగారు బాగున్నారా (1998)
  • * హిట్లర్ (1997)
  • * గోకులంలో సీత (1997)
  • * స్వాతి కిరణం (1992)
  • * ప్రేమ ఎంత మధురం (1991) .... ష్యాం సుందర్

Comments

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)