గుమ్మడి వెంకటేశ్వరరావు-GummadiVenkateswararao
************************************* పరిచయం : తెలుగు సినిమా రంగములో గుమ్మడి గా ప్రసిద్ధి చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు ( జ. జూలై 9, 1927 -మ .27 జనవరి ,2010 ) తెలుగు చలనచిత్రరంగంలో ఐదు దశాబ్దాలకు పైగా అనుభవమున్న నటుడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఈయన 500 కు పైగా సినిమాలలో విభిన్న తరహా పాత్రలు పోషించాడు. చలనచిత్ర రంగానికి ఈయన చేసిన సేవలను గుర్తిస్తూ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. 27-జనవరి ,2010 గుండెపోటు తో మరించారు . మొదటి సినిమా -- అదృష్ట దీపుడు 1950 , చివరి సినిమా --ఆయనకిద్దరు . ప్రొఫైల్ : పేరు : వెంకటేశ్వరరావు , గుమ్మడి , ఉరు : గుంటూరు జిల్లా తెనాలి సమీపములోని రావికంపాడు. ఈయన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. పుట్టిన తేది : జూలై 9, 1927 తండ్రి : బసవయ్య, తల్లి : బుచ్చమ్మ. భార్య : లక్ష్మిసరస్వతి (1944 లో వివాహము), (ప్రస్తుతం చనిపోయారు ). పిల్లలు : ఐదుగురు అమ్మాయిలు ,ఇద్దరు కొడుకులు , (ప్రస్తుతం ఒక అమ్మాయి చనిపోయారు ,) తోబుట్టువుల...