Kavya(Little Soldier-Banni)- కావ్య (లిటిల్ సోల్జర్స్ - బన్నీ)
పరిచయం (Introduction) : 'ఐ యామ్ ఎ వెరీ గుడ్ గాళ్' అని పాడుతూ లిటిల్‌సోల్జర్స్‌లో అన్ని అల్లరి పనులే చేసిన బన్నీని నేనే. ఇప్పుడు అలా అల్లరి చేయకుండా బుద్ధిగా మణిపాల్‌లో ఎంబీబీఎస్ చివరి ఏడాది చదువుకుంటున్నా. దీని తరువాత ఎమ్మెస్ కూడా చేస్తా. మాది హైదరాబాదే. అమ్మానాన్నలిద్దరూ వైద్యులే. వాళ్లని చూసి నేను కూడా పెద్ద డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నా. అందుకే మళ్లీ సినిమాల జోలికి పోలేదు. 'లిటిల్‌సోల్జర్స్' లో చేయడానికి ముందు అమ్మానాన్నలతో కలిసి యూకేలో ఉండేదాన్ని. నటించడం కోసం ఆరు నెలలు ఇండియా వచ్చి, షూటింగ్ అయిపోగానే మళ్లీ యూకేకి వెళ్లిపోయా. అందుకే మీకెవ్వరికీ మళ్లీ కనిపించలేదు. అక్కడే మూడోతరగతి వరకు చదువుకున్నా. తరవాత మా కుటుంబమంతా హైదరాబాద్‌కి వచ్చేసింది. 'లిటిల్‌సోల్జర్స్' చేస్తున్నప్పుడు నాకు మూడేళ్లే. అప్పుడు అది నటన అని కూడా తెలియని వయసు. ఆ సినిమాని తీసింది మా పెదనాన్న గుణ్ణం గంగరాజే కాబట్టి నాకు ఏమీ కొత్తగా అనిపించలేదు. వాళ్లు నవ్వమంటే నవ్వేదాన్ని, ఏడ్వమంటే ఏడ్చేదాన్ని. నేను ఎప్పుడు నటిస్తే అప్పుడే సినిమా తీసేవాళ్లు, నేను చేయకపోతే ఆ రోజు షూట...