భారతీబాబు , Bharathi Babu
పరిచయం : హిందీ, కన్నడ, తమిళ, మళయాళ భాషల నుంచి తెలుగులోకి డబ్బింగ్ అయిన 108 చిత్రాలకు రచయితగా పనిచేసి, "సాహిత్య భారతి' బిరుదు అందుకున్న రచయిత భారతీబాబు . తమిళం బాగా తెలుసు. కన్నడం, మళయాళం, హిందీ భాషలు కూడా వచ్చు ప్రొఫైల్ : పేరు : భారతీ బాబు , కెరీర్ : ప్రముఖ నిర్మాతలు అంగర సత్యం, అంగర లక్ష్మణరావులు ఇతనికి పెదనాన్నలు అవుతారు. మరో ప్రముఖ నిర్మాత మిద్దె రామారావు మావయ్య అవుతారు. వారి ద్వారానే సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు . ప్రొడక్షన్ మేనేజర్ వెంకటేశ్వరరావు ద్వారా ప్రొడక్షన్ విభాగంలో పనిచేసారు . నేటి డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ అప్పుడు శరత్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసేవారు. ఆయన ద్వారా పాటలు ఎలా రాయాలో నేర్చుకున్నాru. ప్రముఖ రచయిత సత్యానంద్ గారి ఏకలవ్య శిష్యుడు . సినిమాకు మాటలు ఎలా రాయాలో ఆయన్ని చూసి నేర్చుకున్నారు . కావాల్సిన వాళ్ళ దగ్గరే కష్టాలు ఎదుర్కొని రచయితగా నిలబడ్డారు . ఆ కష్టాలే ఈయన్ని ఈ రోజున రచయితగా నిలబెట్టాయి. ఫిల్మోగ్రఫీ : కొన్ని డబ్బింగు సినిమాలు : పోలిష్ వేట -- తమిళంలో కమల్ హాసన్ "ఇంద్రజిత్ " బిర్లా -- ర...