Posts

Showing posts with the label చక్రపాణి

చక్రపాణి , Chakrapani

Image
పరిచయం : ఆలూరు వెంకట సుబ్బారావు ( కలంపేరు చక్రపాణి ) ప్రఖ్యాతి పొందిన బహుభాషావేత్త , తెలుగు రచయిత , పత్రికా సంపాదకులు , సినీ నిర్మాత మరియు దర్శకులు. చందమామ - విజయా కంబైన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన వారిలో ఒకరు . ప్రొఫైల్ : జననము : చక్రపాణి గుంటూరు జిల్లా తెనాలిలో 1908, ఆగష్టు 5 న ఒక మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో తండ్రీ : గురవయ్య , తల్లి : వెంకమ్మ , చదువు : జాతీయోద్యమ ప్రభావానికి లోనై హైస్కూలు విద్యకు స్వస్తిచెప్పి యలమంచిలి వెంకటప్పయ్య వద్ద హిందీ భాషను అభ్యసించారు . ఆ సమయంలో హిందీ భాషా వ్యాప్తికి గాఢ కృషిసాగిస్తున్న వ్రజనందన వర్మ దగ్గర హిందీ భాషలో చక్కని పాండిత్యాన్ని గడించారు . ' చక్రపాణి ' అనే కలం పేరును వీరికి అతనే ప్రసాదించారు . తరువాత స్వయంకృషితో సంస్కృతం , ఇంగ్లీషు భాషలలో గాఢ పరిచయాన్ని పొందారు . క్షయ వ్యాధిగ్రస్తుడై 1932 లో మదనపల్లి లోని శానిటోరియంలో వైద్యం కోసం వెళ్ళారు . అక్కడే కొన్ని నెలలు ఉండి , ఒక సాటి రోగి- అయిన ఒక పండితుని సాయంతో బెంగాలీ భాష కూడా నేర్చుకొన్నారు . నేర్చు...