Posts

Showing posts with the label Ramyakrishna - రమ్యకృష్ణ

రమ్యకృష్ణ , Ramyakrishna

Image
     ----------------------------------------------------------------   పరిచయం : కొంతకాలం క్రితం తెలుగు చలన చిత్ర రంగంలో ఒక వెలుగు వెలిగిన కధానాయక రమ్యకృష్ణ. ప్రముఖ చలన చిత్రదర్శకుడు కృష్ణవంశీ ఈమె భర్త. ఇంచుమించు ప్రతీ అగ్రనాయకుడి సరసన ఈమె నటించింది. 1985లో వచ్చిన ఇద్దరుమిత్రులు చిత్రంతో కధానాయికగా తెలుగు చిత్రరంగంలో ప్రవేశించి, 1989లో వచ్చిన సూత్రధారులు చిత్రంద్వారామంచినటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ ఈమెకి చాలా కాలం వరకూ సరయిన అవకాశాలు రాలేదు. ఒకానొకదశలో రమ్యకృష్ణ నటిస్తే ఆ సినిమా పరాజయం పొంది తీరుతుందన్న నమ్మకం కూడా చిత్రసీమలో ఉండేది. 1992లోవిడుదలయిన అల్లుడుగారు చిత్రం ఈమె అదృష్టాన్ని మలుపు తిప్పింది. అప్పటి నుండి కె. రాఘవేంద్రరావుదర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాలలో ఈమె వరుసగా నటించగా, దాదాపు అవన్నీ విజయవంతమై రమ్యకృష్ణ నటిస్తేచాలు ఆ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని నిర్మాతలకు కలిగేలా చేశాయి. టి.వి.యాంకర్ గా గేమ్ షో లో వస్తున్నారు . ప్రొఫైల్ : పేరు : రమ్య కృష్ణ , పుట్టిన తేది : 15-సెప్టెంబర్-1967 . మత...