Posts

Showing posts with the label సుధా చంద్రన్

సుధా చంద్రన్ , Sudha chandran

Image
పరిచయమ :  మయూరి చిత్రం తరువాత ‘కాలం మారి కథ మారి’ అనే చిత్రంలో నటించినా ఆ తరువాత బాలీవుడ్‌ రంగప్రవేశం చేసింది. ‘పతి పరమేశ్వర్‌’తో మొదలైన బాలీవుడ్‌ ప్రస్థానం మరెన్నో సినిమాల దారితీసింది. దాదాపు ఇరవైకి పైగా సినిమాల్లో నటించింది. వీటిలో 1994లో వచ్చిన అంజామ్‌ సినిమా నటిగా సుధాచంద్రన్‌కు మంచిపేరు తెచ్చిపెట్టింది. నెమలికి సైతం నాట్యం నేర్పగలిగే నేర్పరి. ఆమె పాదాలు కదిపితే భరతనాట్యం పరవశిస్తుంది, కూచిపూడి ఆనంద పారవశ్యంలో మునిగిపోతుంది. దాదాపు అన్ని భారతీయ సంప్రదాయ నృత్యాలను అవపోసనపట్టిన ఆమెకు నాట్యమంటే ప్రాణం. ఆమె కేవలం నర్తకి మాత్రమే కాదు నటి కూడా తన అద్భుతమైన నటనతో ఎన్నో సినిమాలకు, టీవి సీరియళ్ళకు ప్రాణ ప్రతిష్ట చేసింది. విధివంచనకు గురై కాలును పోగొట్టుకొన్నా... మొక్కవోని ధైర్యంతో నిలబడి ఆ విధినే సవాలు చేసిన ధీరవనిత. ఆమే సుధాచంద్రన్‌. నర్తకిగానే కాకుండా నటిగాకూడా ఈమె కొల్లగొట్టిన అవార్డులకు అంతేలేదు. మయూరి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించన నాట్య మయూరి సుధాచంద్రన్‌. జీ తెలుగు ఛానల్‌ నిర్వహిస్తున్న మగధీర డ్యాన్స్‌ రియాలిటీ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరించడం ద్వారా చాలాకాలం తరువాత...