Posts

Showing posts with the label Nagabhushanam-నాగభూషణం

నాగభూషణం,Nagabhushanam

Image
******************************************************************************** పరిచయం : కావాలి , నెల్లూరు జిల్లా వాడు. సినిమాలూ ఎవరున్నా ఎంత పెద్దహీరో వున్నా - " మీ సినిమాలో నాగభూషణం వున్నారా ?" అని ఆ రోజుల్లో నిర్మాతల్ని డిస్ట్రిబ్యూటర్లు అడిగేవారు . నాగభూషణం ఒక సినిమాకు నిజంగానే ప్రత్యేకమైన భూషణం . మంచి మనసులు (1962) సినిమా నుంచి పుంజుకుని 15 - 20 ఏళ్లపాటు నాగభూషణం ఏలారు ! అయితే నాగభూషణం పెద్ద పాత్రలో హీరోగా ( ఏది నిజం? 1956) వచ్చినా , విలన్ మారి , హాస్యం కూడా పండించారు . నాగభూషణం ధరించే విలన్ ‌ పాత్రలు ఫక్తు విలన్ ‌ పాత్రల్లా వుండవు . డైలాగుల్లోనూ , ప్రవర్తనలోనూ హాస్యం కూడా మిళితమై వుంటుంది . అందుకే అతను " హాస్యనటుడు కాని హాస్యనటుడు ". ‌ సినీ జీవితం తొలిరోజుల్లో , ఇతర భాషల నుంచి తెలుగుభాషకి వచ్చిన చిత్రాల్లో హీరోలకీ , విలన్లకీ నాగభూషణం డబ్బింగ్ ‌ చెప్పారు . తమిళంలో విశేషప్రాచుర్యం పొందిన ‘ రక్తకన్నీరు ’ ను తెలుగులోకి రాయించుకుని , మూలనాటకంలో ముఖ్యనటుడు ఎం.ఆర్‌.రాధ ‘ స్టయిల్ ‌’ ని...