ఆంజనేయులు.సి.యస్.ఆర్ , Anjaneyulu.C.S.R.
======================================================== పరిచయం : గొప్ప నటులకి ఉండవలసిన లక్షణాలు మూడు: ఆంగికం (అందమైన రూపం), వాచకం (మంచి కంఠస్వరం), అభినయం (హావ భావాలతో ప్రేక్షకులని ఆకర్షించుకోగల సామర్ధ్యం). ఈ మూడు లక్షణాలు మూర్తీభవించిన వ్యక్తి సి.యస్.ఆర్. ఆంజనేయులు. పూర్తి పేరు చిలకలపూడి సీతారామాంజనేయులు. స్థానం నరసింహారావుతో సమ ఉజ్జీ అన్న ప్రశంశలు అందుకున్న నటుడు - ఇటు రంగస్థలం మీదా, అటు వెండి తెర మీదా. పదకొండేళ్ళవయస్సులోనే ఆయన రంగస్థలం మీద రాణించాడు. ఆయన జీవించిన ఐదున్నర దశాబ్దాలలో చలనచిత్ర సీమని తన అపూర్వ వైదుష్యంతో ప్రభావితం చేసేడు. పదాలను అర్థవంతంగా విరిచి, అవసరమైనంత మెల్లగా, స్పష్టంగాపలకడంలో ఆయన దిట్ట. హీరోగా, విలన్గా, హాస్యనటుడి గా విభిన్న పాత్రలకు జీవం పోసిన వారు ఈ ఆంజనేయులు. సుమారు 175 సినిమాలు చేసారు . తెలుగు చిత్ర రంగంలో కొన్ని పాత్రల గురించి ప్రస్తావన వస్తే కొంతమంది నటులు ప్రత్యేకంగా గుర్తుకువస్తారు. భారతంలోని శకుని పాత్ర పేరు చెబితే మొదటగా గుర్తుకు వచ్చేది చిలకలపూడి సీతారామాంజనేయులు. సి. యస్. ఆర్. గా ప్రసిద్ధుడైన ఈయన రంగస్థలం నుండి చిత్రరంగ...