Sri priya - శ్ర్రీప్రియ (actress cum Director)
పరిచయం (Introduction) : Sri priya - శ్ర్రీప్రియ ఒక నాటి మేటి నటి ... ఇప్పుడు సినీ దర్శకురాలు . జీవిత విశేషాలు (profile) : పేరు : Sri priya - శ్ర్రీప్రియ, పిల్లలు : పాప స్నేహ. అబ్బాయి నాగార్జున్. కెరీర్ : తన మాటల్లో .....మాది కళాకారుల కుటుంబం. నేను చిన్నప్పుడే భరతనాట్యం నేర్చుకున్నా. నా నాట్యం చూసిన దర్శకుడొకాయన ఓ చిన్న సినిమాలో అవకాశమిచ్చారు. పాత్ర చిన్నదే అయినా అది నన్ను దర్శకుడు కె.బాలచందర్ దృష్టిలో పడేలా చేసింది. 'అంతులేని కథ' తమిళ వెర్షన్‌లో కథానాయికకి చెల్లెలి పాత్ర అది. కమల్‌హాసన్‌తో కలిసి నటించాలి. అప్పటికే ఆయన పెద్ద స్టార్! కొంత భయంతోనే నటించాను. కానీ ఆ నటన బాలచందర్‌గారికి ఎంతగానో నచ్చిందని తర్వాత తెలిసింది. తెలుగు 'అంతులేని కథ'కి... తమిళంలో నటించిన వాళ్లెవర్నీ ఆయన తీసుకోలేదు. ఒక్క నన్నూ, కమల్‌హాసన్‌ని తప్ప! కమల్‌కి వేరే పాత్ర ఇచ్చారు కానీ నాకు మాత్రం పాత పాత్రే ఇచ్చేశారు. బాలచందర్ అంతటి వారు నాపై పెట్టిన ఆ నమ్మకం నాకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. అంతేకాదు.. తరవాత తన సహాయకుడు ఏరంకి శర్మ తీసిన 'చిలకమ్మ చె...