సి.హెచ్.నారాయణరావు , ChNarayanarao
------------------------------------- Introduction : వృత్తి -నటుడు చిత్తూరు నాగయ్య, వేమూరి గగ్గయ్య, కన్నాంబ, ఋష్యేంద్రమణి, సురభి బాలసరస్వతి వంటి కళాకారులు సినిమా రంగంలో ప్రవేశించక ముందు నాటకరంగాన్ని పరిపుష్టం చేసినవారే. అందుకు భిన్నంగా ఎలాంటి నాటకానుభవం , సిఫారసు లేకుండా సినీరంగంలోకి ప్రవేశించి స్వయంకృషితో నటుడుగా పేరు తెచ్చుకొన్న వ్యక్తి సి.హెచ్.నారాయణరావు. profile : జననం :సి . హెచ్ . నారాయణరావు -1937 మరణం : -ఫిబ్రవరి 14, 1984 Career : వాహినీవారు భక్తి రసాత్మకమైన చిత్రం ‘భక్తపోతన’ (1944) ను విడుదల చేసారు. అందులో రెండు మూడు సార్లు శ్రీరాముడు ప్రత్యక్షమవుతాడు. ఆ శ్రీరాముడ్ని చూసి ప్రేక్షకులు తన్మయులైనారు. అంతకుముందు అంత అందమైన, ఆకర్షణీయమైన శ్రీరామచంద్రుడ్ణి చూడలేదు. ‘సాక్షాత్తు రాముడే’ అన్నారు ప్రజ, పోతన పక్షమై. ఆ శ్రీరామ పాత్రధారి చదలవాడ నారాయణరావు. 1940 లో వచ్చిన సాంఘికం ‘జీవనజ్యోతి’ లో మాంచి పర్శనాలిటి గల హీరో ప్రవేశించాడు. నునుపైన, సహజమైన జుట్టు. సోగకళ్ళు, పొడుగైన ముక్కు, ...