పి.ఆదినారాయణరావు , Adinarayanarao P
============================================ పరిచయం : పి.ఆదినారాయణరావు ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు మరియు నిర్మాత. ప్రొఫైల్ : పేరు: ఆదినారాయణ , పి. పుట్టిన తేది : 21 ఆగష్టు 1918, పుట్టిన ఊరు ; విజయవాడ , మరణము : 25 జనవరి 1991 కెరీర్ : చిన్ననాడే శ్రీ రాజరాజేశ్వరి నాట్యమండలి వారి 'సావిత్రి' నాటకంలో నారదుని పాత్ర పోషించారు. విజయనగరం జిల్లాసాలూరుకు చెందిన 'పెదగురువు' అనే పట్రాయని సీతారామశాస్త్రి తండ్రి గారి వద్ద గాత్రం, హార్మోనియం వాయిద్యాలలోశిక్షణ పొందారు. తరువాత కాకినాడ మెక్లారిన్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్ చదివారు. అప్పుడు అమెచ్యూర్ అసోసియేషన్, బర్మాషెల్ అసోసియేషన్ సంస్థలకు రచన, సంగీత బాధ్యతలు వహించేవారు. ఆ తరువాత సి.పుల్లయ్య దర్శకత్వంవహించిన గొల్లభామ చిత్రానికి గీత రచయితగా చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. బి.ఎ.సుబ్బారావు నిర్మించిన పల్లెటూరిపిల్ల చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. అర్ధాంగి అంజలీదేవి పేరుతో 1953లో అంజలీ పిక్చర్స్ స్థాపించారు. అవార్డులు : 1955లో నిర్మించిన అనార్కలి చిత్రం వీరిని ఉత్తమ నిర్మాతల కోవలోకి చేర్చింది. ఇందులోని ...