Posts

Showing posts with the label శోభన్ బాబు

శోభన్ బాబు

Image
శోభన్ బాబు పూర్తి పేరు ఉప్పు శోభనా చలపతిరావు . ప్రముఖ తెలుగు కథానాయకులలో ఒకరిగా వెలుగొందిన ఈయన 14 జనవరి , 1937 రోజున జన్మించారు . అందమైన రూపం , క్రమశిక్షణ తో కూడిన సినీ జీవితం శోభన్ బాబుది . 1959లో విడుదలైన దైవబలం సినిమాలో శోభన్‌బాబుకు ఒక చిన్నపాత్ర లభించింది.1960లో విడుదలైన భక్త శబరిలో మునికుమారునిగా శోభన్ బాబుకు పాత్ర మరికాస్త ముఖ్యమైన పాత్ర లభించింది. ఇంకా సీతారామ కళ్యాణంలో లక్ష్మణుడు, భీష్మలో అర్జునుడు, లవకుశలో శత్రుఘ్నుడు వంటి పాత్రలలో నటించారు. పుణ్యవతి, చదువుకున్న అమ్మాయిలు, పూలరంగడు , ఇద్దరమ్మాయిలు , బుద్ధిమంతుడు వంటి సినిమాలలో కూడా నటించారు. నర్తనశాలలో అభిమన్యుడిగా నటించిన శోభన్ బాబుకు వీరాభిమన్యు(1965)లో అదేపాత్రలో కధానాయకునిగా నటించే అవకాశం వచ్చింది. అదీ, తరువాత వచ్చిన మనుషులు మారాలి మంచి విజయాన్ని సాధించడంవలన శోభన్ బాబు కధానాయకునిగా నిలద్రొక్కుకున్నారు. మొత్తం 220పైగా చిత్రాలలో నటించారు. శోభన్ బాబును ఆయన అభిమానులు నటభూషణ బిరుదుతో సత్కరించారు. మార్చి 20, 2008 న మెట్లు పైన జారి పడి శోభనబాబు చని పోయారు ఆయనకి 72 సంవత్సరాలు