Veerabhadram(cine director),వీరభద్రమ్(దర్శకుడు)
పరిచయం (Introduction) : ''వినోదాన్ని నమ్ముకుంటే తిరుగుండదనేది నా నమ్మకం. నేను ఇదివరకు తీసిన రెండు చిత్రాల్లోనూ వినోదానిదే అగ్ర తాంబూలం. మూడోసారి కూడా ఆ సూత్రంతోనే ప్రయాణం చేశా'' అంటున్నారు వీరభద్రమ్. 'అహనా పెళ్లంట', 'పూలరంగడు' సినిమాలతో విజయాలు సొంతం చేసుకొన్న దర్శకుడీయన. నాగార్జునతో 'భాయ్' తెరకెక్కించారు. ''సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నప్పుడే నాగార్జునగారిని దృష్టిలో ఉంచుకొని రకరకాల కథలు రాసుకొనేవాణ్ని. ఆయనతో 'భాయ్' పేరుతో ఒక సినిమా తీస్తే బాగుంటుందనే ఆలోచన ఎప్పట్నుంచో ఉండేది. ఆ అవకాశం నాకు ఇప్పుడు దొరికింది. వినోదం, యాక్షన్ అంశాలతో మిళితమైన చిత్రమిది. నాగార్జున లాంటి ఒక స్టార్ కథానాయకుడిని తెరపై ఎలా చూడాలనుకొంటారో... అలాగే చూపించాను. 'హైదరాబాద్‌లో రెండు ఫేమసు. ఒకటి ఇరానీ ఛాయ్... రెండు ఈ భాయ్' తరహా సంభాషణలు చాలా ఉంటాయి. ఈ సినిమా పేరు, సంభాషణల గురించి చెప్పగానే నాగార్జున 'ఈ సినిమా చేస్తున్నాం' అని చెప్పి నన్ను ప్రోత్సహించారు. ఆయన ఈ సినిమా చేయడమే కాదు... సొంతంగా నిర్మించడానికి ముందుకు...