Anjali TV artist,అంజలి టి.వి నటి
పరిచయం (Introduction) : అనుకోకుండా అవకాశం వచ్చింది... అందుకే నటిస్తున్నా' అని చెప్పదు అంజలి. ఆమె ఇష్టపడి ఈ రంగంలోకి వచ్చింది. చేసిన ప్రతి పాత్రనూ శ్రద్ధగా చేసింది. 'సంబరాల రాంబాబు' నుంచి 'మమతల కోవెల' దాకా యాభై సీరియళ్లలో నటించిన ఆమె చెబుతున్న కబుర్లివి.అమ్మకు డాన్స్, నటన అంటే ఎంతో ఇష్టం. కానీ అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం, కుటుంబ పరిస్థితులూ తనని వాటన్నిటికీ దూరం చేశాయి. దాంతో తన కోరికను నా ద్వారా తీర్చుకోవాలనుకొనేది. జీవిత విశేషాలు (profile) : పేరు : అంజలి టి.వి నటి , ఊరు : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. నాన్న : వ్యవసాయం చేసేవారు. అమ్మ : గృహిణి. చదువు : డిగ్రీ ఫైనలియర్ కెరీర్ (Career) : పదో తరగతి సెలవుల్లో బంధువుల ఇంటికని హైదరాబాద్ వస్తే తెలిసిన ఒకతను 'మీ అమ్మాయికి నటన అంటే ఆసక్తి ఉందా, అవకాశం ఇప్పిస్తా' అనడిగారు. అమ్మ కోరిక కూడా అదే కావడంతో కొన్ని ఫొటోలు తీయించి వాళ్ల ఆఫీసుకి పంపించింది. ఎంపికకావడంతో ఓ భక్తి సీరియల్‌లో నటించి తిరిగి మా ఊరు వెళ్లిపోయా. ఇంటర్లో చేరిన కొద్ది రోజులకు 'కళాంజలి' దుస్తులకు మ...