పింగళి నాగేంద్రరావు, NagendraraoPingali
---------------------------------------------------------------------------------------- పరిచయం : ‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట ఎనభయ్యో పడిలో అడుగుపెట్టింది. ఈ ఎనిమిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) రాశారు. ముఖ్యమైన జాబితా లో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు. ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు పింగళి నాగేంద్ర గారు . పింగళి నాగేంద్రరావు (1901 - 1971) ఒక తెలుగు సినిమా రచయిత . పింగళి నాగేంద్రరావు కేవలం సినిమా రఛయిత మాత్రమే కాదు . పాత్రికేయుడు , నాటక రచయిత కూడా . కృష్ణా పత్రిక , శారద పత్రికల్లో ఆయన ఉపసంపాదకుడు గా పని ఛేసారు . వింధ్య రాణి , నా రాజు , జేబున్నీసా , మేవాడు రాజ్య పతనం , క్షాత్ర హిందు , నా కుటుంబం , గమ్మత్తు ఛావు తదితర నాటకాలు ఆయన రాసినవే . నాటక రచయితగా లబ్ద ప్రతిష్టులైన పింగళి నాగేంద్రరావ...