Raghavacharya Ballari - రాఘవాచార్య బళ్ళారి
పరిచయం (Introduction) :
సినిమాలు రుచించని మహా నటుడు -రంగస్థలం మీద మహానటులనిపించుకున్న వాళ్లలో కొందరు సినిమాలకి వచ్చినా వారికి ఈ వాతావరణం నచ్చలేదు. రంగస్థలం మీద పొందే ఆనందం, అనుభవం వాళ్లకి సినిమాల్లో లభించలేదు. రంగస్థలం మీద నటిస్తున్నప్పుడు ఎదురుగా ప్రేక్షకులు మాత్రమే వుంటారు. సినిమాలకి అలా కాదు. నటులకీ ప్రేక్షకులకీ మధ్య, దర్శకుడు, ఛాయాగ్రహకుడు, ఎడిటరు, టెక్నీషియన్లూ వీళ్లందరూ 'అడ్డం'గా వుంటారు. సినిమా నటనని యాంత్రికంగా భావించారు. ఈ యంత్రాలకీ ఇక్కడి టెక్నిక్‌కీ లోబడని నటులు సినిమాలకి ఉద్వాసన చెప్పేశారు. బళ్లారి రాఘవాచార్య వంటి గొప్ప రంగస్థల నటుడికి అలాంటి ఇబ్బందే ఎదురైంది. మూడే మూడు సినిమాల్లో నటించారు. ఆ తరవాత సినిమాలు వద్దనుకున్నారు. రంగస్థలం మీద ఆయన నటించిన హిరణ్యకశిపుడు, రావణుడు, దుర్యోధనుడు లాంటి పాత్రల్ని విశ్లేషించి, ఆయన నూతన కోణంలో ఆవిష్కరించారు. హిరణ్యకశిపుడు ఒక తండ్రి. ఏ తండ్రీ కొడుకుని బాధలుపెట్టడు. కాని, పెట్టవలసి వచ్చినందుకు హిరణ్యకశిపుడు తండ్రిగా బాధపడాలి కదా! రాఘవచార్య ఆ పాత్రని అలా తీర్చిదిద్దారు. అలాగే రావణుడు, దుర్యోధనుడూ, వీళ్లందర్నీ క్రూరులుగానే చిత్రిం...