సాలూరు రాజేశ్వరరావు , Rajeswararao Saluru
------------------------------------------------------------------------------------------ పరిచయం : సాలూరు రాజేశ్వరరావు (Saluru Rajeswara Rao) తెలుగు సినీ రంగంలో సుమారు ఐదు దశాబ్దాలపాటు మధురమైన గీతాలందించి , తెలుగువారు గర్వించదగ్గ సంగీతదర్శకుల లో ఒకడు . ఎన్నో అజరామరమైన వెండితెర వెలుగులకు సంగీతపు మధురిమలు అందించినవారిలో ఆయనకు ప్రత్యేక స్థానముంది . బాల్యం పుట్టిన ఊరు : సాలూరు మండలములోని శివరామపురం గ్రామము పుట్టిన తేది : 1922 సంవత్సరంలో జన్మించాడు . మరణించిన తేది : అక్టోబర్ 26, 1999, ఉదయం కన్నుమూసినరు . తండ్రీ : సన్యాసిరాజు . కెరీర్ : రాజేశ్వరరావుకి అతి చిన్న వయసులోనే సంగీతం అబ్బింది . ప్రారంభంలో తండ్రి సన్యాసిరాజు వద్దే “ సరిగమలు ” దిద్దాడు . సన్యాసిరాజుగారు ప్రముఖ వాయులీన విద్వాంసులైన ద్వారం వెంకటస్వామి నాయుడుకి కచేరీలలో మృదంగంపై సహకరించిన వ్యక్తి . అలాగే అప్పట్లో మూకీ సినిమాలకు తెరముందు , హార్మోనియం వాద్యకారునిగా , సంగీతాన్ని వినిపించేవాడు . అంతేకాదు రాజేశ్వరరావు మంచి గేయ రచయిత కూడా ! " ఆ తోటల...