Posts

Showing posts with the label కౌశిక్ బాబు

కౌశిక్ బాబు , Kaushik Babu

Image
పరిచయం : "చాలా బాగుంది" ద్వారా సినిమాలో ప్రవేశించి, "మనోయజ్ఞం" సీరియల్ ద్వారా అందరికీ తెలిసిన కౌశిక్ బాబు మన రాష్ట్రంలోనే గాక కేరళలో గుర్తింపు పొందడం తండ్రిగా గర్విస్తున్నానని, పురాణకథలోని అయ్యప్ప పాత్రను ఇంతకుముందు సీరియల్స్‌లో పోషించినా సినిమాలో చేయడం ప్రథమమనీ, ఇది దేవుని కృపగా భావిస్తున్నానని సీనియర్ పాత్రికేయుడు విజయ్ బాబు వ్యాఖ్యానించారు. కౌశిక్‌బాబు మాట్లాడుతూ.. బాలనటుని స్థాయి నుంచి ప్రధాన పాత్ర స్థాయికి ఎదగడం ఆనందంగా ఉందనీ, అనుభవజ్ఞులైన వారితో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తెలుగుతేజం కౌశిక్ బాబు ఆల్‌రెడీ కేరళలో అయ్యప్పగా భక్తుల మన్ననలను పొందుతున్న విషయం విదితమే. ఆయన కనబడితే చాలు... భక్తిపారవశ్యంలో ఆయన ఆశీర్వచనాలు కోరుకుంటారని దర్శకుడు శశిమోహన్ చెబుతున్నారు. తెలుగు పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన శశిమోహన్ తాజాగా "శబరిమల శ్రీ అయ్యప్ప" చిత్రానికి నేతృత్వం వహిస్తున్నారు. అనశ్వర చారిటబుల్ ట్రస్ట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజీష్ మణి నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. స్వామి అయ్యప్ప , టెలి సీరియల్ , తెలుగు , తమిళ , మలయాళ భాషల్లో ఏ...