కార్తీక , Karthika(actress)
పరిచయం : నటి రాధ కూతురు ఈ కార్తీక ... జోష్ తెలుగు సినిమా లో నాగచైతన్య సరసన తొలిసారిగా నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు. .టాప్ హీరోయిన్ కూతురుగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ సరైన హిట్ అందుకోవడంలో సక్సెస్ అందుకోలేకపోయిన పొడుగు కాళ్ళ సుందరి కార్తీక నటిగా తన టాలెంట్ నిరూపించుకునే సినిమా దొరికిందని చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం కార్తీక తమిళ్ లో బాగా ఫేమస్ అయిన భారతీ రాజా దర్శకత్వంలో ‘అన్నా కొడై’ సినిమాలో నటిస్తోంది. ప్రొఫైల్ : పేరు : కార్తీక , పూర్తిపేరు : కార్తీకా నాయర్, పుట్టినరోజు : జూన్ 27 అమ్మ : రాధ నటి , నాన్న : రాజశేఖరన్ నాయర్ (హొటల్ యజమాని), తోబుట్టువులు : చెల్లెలు - తులసి , తమ్ముడు - విఘ్నేష్ , పెద్దమ్మ : అంబిక - నటి ,పెద్దనాన్న - సుదీష్ ; చదువు : +2 , బిజినెస్ కోర్సులో ఇంటర్నేషనల్ డిగ్రీ చదువుతోంది, తెరంగేట్రం : 'జోష్'లో నాగచైతన్యతో కలసి నటిగా పరిచయమయ్యా, రెసిడెన్స్ : ముంబై , నాన్న ముంబై వాసి . తొలి డైలాగ్ : హీరోతో 'ఆహా.. అలా కాదమ్మా' అని ముద్దుగా చెప్పాలి. కాస్త భయపడుతూనే చెప్పారట, ఖాళీగా ఉంటే : పబ్‌లకూ షికార్లకూ వెళ్లను...