Kovvali Laxminarasimharao(writer)-కొవ్వలి లక్ష్మీనరసింహరావు(రచయిత)
-- courtesy with Ravi kondalarao@pathabangaram of eenadu news paper. పరిచయం (Introduction) : ఆ రోజుల్లోని మధ్యతరగతి స్త్రీలకు పుస్తకాలు చదవడం నేర్పిన గొప్ప రచయిత కొవ్వలి లక్ష్మీనరసింహరావు. అవి- ఆయన రాసిన నవలలు. ''కొవ్వలి వారి నవలలు'' అంటే, ఆనాడు విపరీతమైన అభిమానం ఉండేది. కొత్త నవల మార్కెట్‌లోకి వచ్చిందంటే చాలు- అమ్ముడయిపోయేది. 64 పేజీల నవల. కొందరు ఇంటికి తెచ్చి అద్దెకిచ్చేవారు. ఒక రోజు పుస్తకానికి 'కాణీ' అద్దె. నవల వెల రెండు అణాలు. ఈ నవలల్లోని కథలు మామూలు కుటుంబ కథలు. మంచి వ్యావహారిక భాషలో, సహజమైన సంభాషణలతో రాసేవారు ఆయన. ఇవాళ కాలక్షేపానికి, టీవీ సీరియళ్లు చూసినట్టు- ఆ రోజుల్లో కొవ్వలి పుస్తకాలు గొప్ప కాలక్షేపం. రైలు ప్రయాణంలో ప్రతి వారి చేతిలోనూ కొవ్వలి నవల ఉండేది. ఈ చదివించే ధోరణిని- ఆయనే ప్రవేశపెట్టారు. అది ఒక యుగం! అప్పట్లోనే, ఆయన రాసినట్టుగానే ఇంకా మరికొందరు రచయితలు నవలలు రాస్తూ వచ్చారుగాని, ప్రథమ స్థానం కొవ్వలిదే.రాసిన మొత్తం నవలల సంఖ్య 1000కి పైగా జీవిత విశేషాలు (profile) : పేరు : కొవ్వలి లక్ష్మీనరసింహరావు(రచయిత), పుట్టిన తేద...