M.S.Reddy(producer)-ఎం.ఎస్.రెడ్డి
పరిచయం (Introduction) : యం.యస్.రెడ్డి గారు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత మరియు రచియిత . చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు..1963 లో నెల్లూరు లో సుందర్ మహల్ థియేటర్ ను నిర్మించారు . హైదరాబాద్ లో ' శబ్ధాలా స్టుడియోను స్థాపించారు . నిర్మాతగా, గేయకవిగా, పద్య కవిగా, పలు సంఘాలకు నాయకుడిగా...తెలుగువారికి దగ్గరైన యం.ఎస్.రెడ్డి ఇకలేరు. ఆయన మరణించారన్న (11-డిసెంబర్ 2011) వార్త సినీ అభిమానుల్ని కలవరపర్చింది. మంచి సినిమాలేకాదు, మంచి మనసు కలవారని సినీ పరిశ్రమలో ప్రతీ ఒక్కరూ ఆయనకు నివాళి అర్పించారు. జీవిత విశేషాలు (profile) : పేరు : ఎం.ఎస్.రెడ్డి (పూర్తిపేరు -మల్లెమాల సుందర రామిరెడ్డి ), కలం పేరు : మల్లెమాల , పుట్టిన తేదీ : 15- ఆగస్ట్ -1925 , నివాసము : ఫిలిం నగర్ -హైదరాబాద్ , పుట్టిన ఊరు : అలివిరి గ్రామము -నెల్లూరు జిల్లా , వెంకటగిరి తాలూక , పిల్లలు : కొడుకు - శ్యాంప్రసాద్ రెడ్డి , తొలి సినిమా : భార్య (తెలుగు), మరణము : 11.డిసెంబర్ 2011, కెరీర్ (Career): నెల్లూరు జిల్లా వెంకటగిరి తాలూకాలోని అలిమిలి అనే మారుమూల గ్రామంలో 1924, ఆగస్టు 15న యం.ఎస్.రెడ్డి జన్మించారు. వీరిది కాస్త పేరున్న వ్యవసాయ క...