Posts

Showing posts with the label Indu -ఇందు(TV.anchor)

Indu -ఇందు(TV.anchor)

Image
  పరిచయం (Introduction) : కూతుర్ని బాగా చదివించాలని అమ్మానాన్నలు కలలు కంటే... తను మాత్రం చదువు మధ్యలోనే మానేసింది. యాంకర్‌గా పేరు తెచ్చుకోవాలని ఆశపడింది. అనుకున్నది సాధించింది. ఈటీవీ 'సఖి', టీవీ9 'స్వీట్‌ హోమ్‌' కార్యక్రమాలతో ప్రతిరోజూ మనల్ని పలకరిస్తున్న ఇందు చెప్పిన ముచ్చట్లు ఇవి. నేను యాంకర్‌గా ప్రయాణం మొదలుపెట్టి ఎనిమిదేళ్లవుతోంది. నిజానికి నేను ఈ రంగంలోకి వస్తాననుకోలేదు. చిన్నతనంలో టీవీ, సినిమాలతో అసలు సంబంధం ఉండేది కాదు.  కెరీర్ :తన మాటల్లో-> మాది విశాఖపట్నంలో ఓ సంప్రదాయ కుటుంబం. నాన్న ఆర్టీసీ ఉద్యోగి. అమ్మానాన్నలకు మేం నలుగురం ఆడపిల్లలం. మా అందర్నీ బాగా చదివించాలన్నదే నాన్న కోరిక. అక్కలందర్నీ సొంతూరులోనే చదివించినా క్రమశిక్షణ అలవడుతుందనే ఉద్దేశంతో నన్ను మాత్రం ఏలూరులోని సెయింట్‌ థెరిసా కాలేజీలో ఇంటర్‌ చదివించారు. కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగితే చాలు... వ్యాఖ్యాతగా వ్యవహరించేదాన్ని. అలానే నా ఆటాపాటా ఉండి తీరాల్సిందే. చదువుకంటే వీటికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చేదాన్ని. నాన్నకు మాత్రం అది ఇష్టం ఉండేది కాదు. దాంతో డిగ్రీ చదివేందుకు మళ్లీ వ...