Posts

Showing posts with the label దాశరథి కృష్ణమాచార్య

దాశరథి కృష్ణమాచార్య , Dasaradhi Krishnamacharya

Image
పరిచయం : ‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట ఎనభయ్యో పడిలో అడుగుపెట్టింది. ఈ ఎనిమిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) రాశారు. ముఖ్యమైన జాబితా లో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు. ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు ...దాశరధి కృష్ణమాచార్య. తరతరాలు గా 'బూజు పట్టిన భావాలను తరిమిగొట్టి ' కోటి రత్నాల వీణ' కు మధుర పదాలు అర్పించిన పొట్టి తట్టి కవి , ఈయ న పూర్తి పేరు దాశరధి కృష్ణమాచార్య . అన్నపూర్ణా వారి " ఇద్దరు మిత్రులు" తో సిని కవి జీవితం ప్రారంభించి , సిని పరిశ్రమలోని చిన్న వర్కర్ సయితం తన మిత్రుడన్నట్లుగా నడుచుకొన్న సహృదయుడు . తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య దాశరథి గా ఆయన సుప్రసిద్ధుడు . పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విము...