Beautiful daughters in mothers way,అమ్మల బాటలో అందాల డాటర్స్
పరిచయం (Introduction) : మహిళల్ని ఆకాశంలో సగం అంటారు. సృష్టిలో వారిది ప్రత్యేక స్థానం. పూజనీయ వ్యక్తులుగా తల్లి, తండ్రి, గురువు, దైవం.. ఇలా క్రమ పద్ధతిలో కొలుస్తారు. తల్లి మొదటి స్థానంలో ఉంటారు. దీన్ని బట్టే మహిళల ప్రాధాన్యం ఏంటో అర్థమవుతుంది. పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. దేశాల్ని ఏలుతున్నారు. భూమండలాన్ని దాటి రోదసీ యాత్రలు చేస్తున్నారు. మహిళల్ని గౌరవించుకోవడానికి మహిళా దినోత్సవం ఉన్నట్లే, కుమార్తెల ప్రతిభను గుర్తించడానికి 'డాటర్స్ డే' జరుపుకొంటున్నారు. ఈరోజే 'డాటర్స్ డే'. ఈ సందర్భాన్ని పురష్కరించుకుని వివిధ రంగాల్లో రాణించిన తల్లీకూతుళ్ల వివరాలు మీకు అందిస్తున్నాం. అమ్మలాగే.. మేమూ: బాలీవుడ్ లో తమ నటనతో అభిమానులు మెప్పించిన ప్రఖ్యాత కథానాయికలు ఎంతో మంది ఉన్నారు. అత్యుత్తమ ప్రతిమ కనబరిచిన తల్లీకూతుళ్లూ ఉన్నారు. నిన్నటి తరం తారలు బాలీవుడ్ ను ఏలితే, తామేం తక్కువ కాదంటూ వారి తనయిలు దూసుకొచ్చారు. అందం, అభినయంతో చెరగని ముద్ర వేశారు. తనూజ-కాజోల్, షర్మిలా -సోహా అలీ ఖాన్, - అపర్ణా సేన్- కొంకణా స...