సౌందర్య (రజినీకాంత్ కూతురు) , Soundarya (Daughter of Rajinikanth)
---------------------------------------- పరిచయం : సౌందర్య , తమిళ సిని నటుడు - రజిని కాంత్ కూతురు , " కథానాయకుడు " సినిమా లో 'సినిమా సినిమా ' అనే పాట లో ఆఫీసు లో పని చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఒచేర్ స్టూడియోస్ అధినేత. సౌందర్య రజనీకాంత్... ఇప్పటివరకూ సూపర్‌స్టార్ కూతురిగానే తెలుసు. కానీ 'విక్రమసింహ'తో దేశంలోనే తొలిసారిగా 'మోషన్ క్యాప్చర్' పద్ధతిలో సినిమా తీసిన దర్శకురాలిగా పరిచయమయింది. సూపర్ స్టార్‌కి 'కట్' 'యాక్షన్' చెప్పే అవకాశం కొట్టేసిన ఈ తొలి మహిళా దర్శకురాలు చెబుతోన్న మరి కొన్ని కబుర్లు... అసలు పేరు షకూ భాయ్ రావ్ గైక్వాడ్. చదువు చిన్నప్పుడంతా చెన్నైలో అమ్మ నడిపిస్తోన్న ఆశ్రమ పాఠశాలలోనే చదివా. తరవాత ఆస్ట్రేలియాలో గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేశా. దర్శకత్వం కాకుండా నరసింహ, చంద్రముఖి, శివాజీ తదితర సినిమాలకు గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేశా. 'గోవా' సినిమాకు నిర్మాతగా మారా. 'కథానాయకుడు'లో అతిథిగా కనిపించా. గ్రాఫిక్స్, యానిమేషన్, ఎడిటింగ్...