తరుణ్ , Tarun
పరిచయం : దక్షిన భారత సిని నటుడు , తెలుగు నటి రోజారమణి కుమారుడు . బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ పుట్టిన రోజుః జనవరి 8, 1983. అలనాటి నటి రోజారమణీ, నటుడు చక్రపాణి దంపతుల కుమారుడు. 1990లో 'మనసు మమత' చిత్రంతో వెడితెరకు పరిచయమైన తరుణ్ కి మణిరత్నం 'అంజలి' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరొచ్చింది. ఈ సినిమాలోని నటనకు గానూ... జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. అంజలి తర్వాత 'దళపతి', 'ఆదిత్య 369', 'తేజ' వంటి ఎన్నో చిత్రాల్లో బాలనటుడిగా నటించి... ప్రేక్షకుల్ని మెప్పించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తర్వాత చదువు కోసం కొంత విరామం తీసుకుని... మళ్ళీ 2000 సంవత్సరంలో విజయభాస్కర్ దర్శకత్వంలో 'నువ్వే కావాలి' సినిమాతో హీరోగా తెరమీదకొచ్చాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో తరుణ్ టాలీవుడ్ లో లవర్ బోయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత 'ప్రియమైన నీకు', 'నువ్వులేక నేను లేను', 'నువ్వే నువ్వే', వంటి చిత్రాలు తరుణ్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రొఫైల్ : పేరు : తరుణ్ , పుట్టిన తేది : 08-జనవ...