రాజశ్రీ (సినీ రచయిత) , Rajashri
పరిచయం : రాజశ్రీ ( ఇందుకూరి రామకృష్ణంరాజు ) ప్రముఖ సినీ రచయిత. ఈయన ఎక్కువగా అనువాద చిత్రాలకు మాటలు , పాటలు రాసాడు . బి . యస్సీ ఫిజిక్సు చేసి ఆ తర్వాత రెండు మూడేళ్ళు విజయనగరం తహసిల్దారు వద్ద పి . ఏ గా చేసి , అక్కడ నచ్చక మద్రాసు వెళ్ళిపోయారు . అక్కడ ఎం . జి . ఆర్ ని కలిసి ఆయన కోసం రాసిన ఒక కథను వినిపించారు . అది నచ్చడంతో తేడివంద మాప్పిళ్ళ పేరుతో సినిమా తీసారు . అది విజయవంతం అయ్యింది . ఆ తర్వాత దాదాపు 60 వరకు తమిళ చిత్రాలకి కథ , స్క్రీన్ ప్లే అందించారు . సుమారు 1000 చిత్రాలకు రచన చేసారు . అంతే కాకుండా ఎం కన్న బాబు , మామా కోడలు , పెళ్ళిచేసి చూపిస్తాం మరియు పుదియ సంగమం అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు . చదువు సంస్కారం , నిజం నిద్రపోదు చిత్రాలకు దర్శకత్వం వహించారు . మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం గీతాంజలికి మాటలు రాసారు . మట్టిలో మాణిక్యం , బంగారు గాజులు చిత్రాలకు బంగారు నంది పురస్కారాలు అందుకున్నారు . రాజశ్రీ రచన చేసిన చివరి చిత్రం ప్రేమికుడు . 1994 లో నిదురలోన...