శివా రెడ్డి , Shiva Reddy
పరిచయం : శివ రెడ్డి ఆరి తేరిన మిమిక్రి కళా కారుడు . చిన్నతనం లోనే తండ్రి చనిపోతే అబద్దమాడి మిమిక్రి చేసి డబ్బులు సంపాదించి అమ్మ కు ఇచ్చేవాడు . సుమారు 2000 మిమిక్రి ప్రోగ్రాములు చేసారు . ప్రొఫైల్ : పేరు : శివ రెడ్డి , ఊరు : బ్రాహ్మణా పల్లి - రామగుండము ప్రక్కన , కరీం నగర్ జిల్లా . నాన్న : చల్ల రాజారెడ్డి , ఎ . పి . యస్ . ఇ . బి . లో ఉద్యోగం . వ్యవసాయము కూడా చేసేవారు . అమ్మ : ప్రభావతమ్మ , తోబుట్టువులు : ఆరుగురు అన్నదమ్ములు , ఇద్దరు అక్కయ్యలు .. ఒకతను చనిపోయారు . ఇతను 5 వ వాడు , చదువు : 10+ , పెళ్లి : 03-05-2009 , ప్రపంచ నవ్వుల రోజు న (International laughter day) స్వాతి (మెదక్ జిల్లా సిద్దిపేట కు చెందిన యల్ .ఐ .సి .దేవలేప్ మెంట్ ఆఫీసర్ - తిరుపతి రెడ్డి , పద్మ దంపతుల ఏకైక పుత్రిక) కెరీర్ : చిన్నతనము లోనే తండ్రి చనిపోవడం వలన , తల్లి పోషణ లోనే పెరిగిన సున్నిత మనస్కుడైన శివారెడ్డి అందరికి సాయం చేసే మనస్తత్వం పెంపొందించుకున్నారు . అమ్మకు ఆర్ధికం గా సహాయం చేద్దాం అనే ఉద్దేశం తో చిన్న వేషాలు , మిమిక్రెలు చేస్తూ డబ్బులు సంపా...