నిర్మలమ్మ,Nirmalamma
----------------------------------------------------------------------------------------------- పరిచయం : నిర్మలమ్మ వందలాది తెలుగు చిత్రాలలో నటించారు. కారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలలో నటించిన ఆమె సహజ నటిగా గుర్తింపు పొందారు. 1950 లో తన 16 వ ఏట "గరుడ గర్వభంగము "సినిమా తో తన సినిమా కెరీర్ ని ప్రంభించి సుమారు 1000 సినిమాల లో నటించారు . సినిమా తెలుగింటి బామ్మ గా పేరు పొందేరు . తల్లిగా, బామ్మగా అనేక చిత్రాలలో నటించారు. ప్రముఖ హీరోలందరికి, హీరోయిన్లకి బామ్మగా జీవిస్తూ అందరికీ ఆత్మీయురాలిగా అందరి మనసులలో నిలిచారు. సినిమాలలోనే కాదు షూటింగం సమయంలో సెట్లో ఉన్న వారందరికీ కూడా ఆమె బామ్మే! ప్రొఫైల్ : పేరు : నిర్మలమ్మ . అసలుపేరు : రాజమణి . పుట్టిన తేది : 1920 లో, ఊరు :మచిలీ పట్నం -బందరు - కృష్ణ జిల్లా , భర్త : కృష్ణారావు - స్టేజ్ ఆర్టిస్ట్ - ప్రజానాట్యమండలి లో వుండేవారు , తరువాత పద్మాలయ స్టూడియోస్ లో దాసరినారాయణరావు దగ్గర ప్రొడక్షన్ మేనేజర్ గా వుండేవారు . పిల్లలు : నిర్మల , కృష్ణారావు లకు పిల్లలు పుట్టలేదు కావున దత్తత చేసుకున్నారు -- ...