Posts

Showing posts with the label Gazal Srinivas

గజల్ శ్రీనివాస్ , Gazal Srinivas

Image
పరిచయం (Introduction) : ప్రముఖ కళాకారుడు గజల్ శ్రీనివాస్‌ను గిన్నిస్ రికార్డు వరించింది.గజల్ శ్రీనివాస్ అంటే తెలుగు కళాప్రియులకి సుపరిచితం అయిన పేరే! తెలుగులో గజల్స్ ని బాగా పాపులర్ చేసిన కళాకారుడు. ఆయన గజల్స్ చెప్పే విధానం కూడ చాలా బాగుంటుంది.మధ్య మధ్య లో చిన్న చిన్న సొంత వ్యాఖ్యానాలు జతచేస్తూ చెప్తూంటే బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఆయన గజల్స్! ఆయన చెప్పే విధానం ఒకే ఫ్లో లో భలే ఉంటుంది. గాంధీజీ తత్త్వంపై ఏకంగా 100 భాషల్లో పాటలు పాడిన శ్రీనివాస్ ప్రతిభను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. ఈ మేరకు గురువారం శ్రీనివాస్‌కు గిన్నిస్ బుక్‌లో చోటు కల్పిస్తున్నట్లు ఓ సందేశం పంపింది.జాతిపిత మహాత్మా గాంధీకి వినూత్న రీతిలో నివాళులర్పించే దిశగా గజల్ శ్రీనివాస్ ఓ పాటను వంద భాషల్లో ఆలపించే సాహసకృత్యానికి విజయవాడ వేదికైంది. బాపూజీ సిద్ధాంతాలపై తెలుగు, ఆంగ్లంతో పాటు మొత్తం 56 భారతీయ భాషల్లోనూ, 44 విదేశీ భాషల్లోనూ అదే గేయాన్ని, అదే స్వరంతో గానం చేసే యజ్ఞాన్ని దిగ్విజయంగా ముగించారు. ఈ కార్యక్రమాన్ని మొత్తం రికార్డు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు కూడా పంపారు. సుమారు ఐదు న...