Posts

Showing posts with the label H.M.Reddy(hanumappa muniyappa reddy)- హెచ్.ఎమ్.రెడ్డి

హెచ్.ఎమ్.రెడ్డి , Reddy H M

Image
- ------------------------------------------------------- పరిచయం : తొలి తెలుగు మాటల సినిమా ‘భక్త ప్రహ్లాద’ తీసినవారు హెచ్‌.ఎమ్‌.రెడ్డి. ఆయన పూర్తిపేరు హనుమప్ప మునియప్ప రెడ్డి.... నటుడు , సినిమా దర్శకుడు మరియు నిర్మాత . ఆయన హైదరాబాదు జాగీర్దార్‌ కాలేజీలో ఇంగ్లీషు టీచరుగా పనిచేసేవారు. 1927లో ప్లేగువ్యాధి ప్రబలినపుడు చాలాకుటుంబాల వలెనే వూరువిడచి బొంబాయి వెళ్ళారు. తన బావమరిది హెచ్‌.వి.బాబు అండతో సినిమా రంగంలోప్రవేశించారు. అక్కడక్కడా వేషాలు వేస్తూ సినిమా టెక్నిక్ను కొంతవరకూ అర్థం చేసుకున్నారు. 1930లో ఇంపీరియల్‌ కంపెనీకి ‘విజయకుమార్‌’, 1931లో ‘ఎ వేజర్‌ ఇన్‌ లవ్‌’ అన్న రెండు మూకీలనుహెచ్.ఎమ్.రెడ్డి డైరెక్ట్‌ చేశారు. రెండు చిత్రాల్లోనూ పృథ్వీరాజ్‌ కపూర్‌ ముఖ్యపాత్రధారి. అలా - శబ్దరహిత చిత్రాలు తీసి హెచ్‌.ఎమ్‌.రెడ్డి, 1931లో శబ్దసహిత చిత్రాలు తీశారు. హిందీలో తొలి టాకీ ‘ఆలం ఆరా’ అర్దేషిర్‌ ఇరానీ తీశాడు. ఆయనకి తెలుగులోనూ, తమిళంలోనూ కూడా చిత్రాలు తియ్యాలనిపించింది. హెచ్‌.ఎమ్‌.రెడ్డి తెలుగువాడు గనక భక్తప్రహ్లాద’ని ఆయనకు అప్పజెప్పారు. అలాగే ‘కాళిదాసు’ కూడా తమిళ...