Posts

Showing posts with the label Vaddepalli Krishna(cine Writer)

Vaddepalli Krishna(cine Writer) .వడ్డేపల్లి కృష్ణ డా(రచియిత)

Image
పరిచయం (Introduction) : సినిమా పెళ్లిపాటల్లో 'ముద్దుల జానకి పెళ్లికి...' గీతానికో గుర్తింపు ఉంది. దీన్ని డా|| వడ్డేపల్లి కృష్ణ రాశారు. ఆయన కెరీర్‌కి ఈ పాట టర్నింగ్‌పాయింట్‌ జీవిత విశేషాలు (profile) : పేరు : కృష్ణ వడ్డేపల్లి -డా. ఊరు : హైదరాబాద్ , కెరీర్ : ఆయన మాటలలోనే -> తొలిసారి సినిమా పాట రాసింది 1979లో. ప్రముఖ సంగీత దర్శకులు టి.చలపతిరావుగారు నా రచనలు చూసి ఓ చిత్రంలో అవకాశం ఇచ్చారు. కానీ, ఆ తొలిగీతం ట్రాక్‌ వాయిస్‌కి మాత్రమే పరిమితమైంది. అయినా నిరాశచెందకుండా ప్రయత్నాలు చేశాను. అలా ఓసారి భానుమతీ రామకృష్ణ దంపతులను కలిశాను. వాళ్లు నా రచనలు చూసి ఎంతో ముచ్చటపడ్డారు. 'రచయిత్రి'లో ఓ పాట రాయించారు. తరవాత అక్కినేని నాగేశ్వరరావు గారు నన్నెంతగానో ప్రోత్సహించారు. ఆపై సింగీతం శ్రీనివాసరావుగారి 'పిల్ల జమిందారు' చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆ చిత్రంలోని 'నీ చూపులోని విరజాజివాన' పాట అప్పట్లో సూపర్‌హిట్‌. దాంతో రచయితగా బాగానే గుర్తింపు వచ్చింది. కానీ అవకాశాలు మాత్రం అడపాదడపా మాత్రమే వస్తుండేవి. పాటల్ని నమ్ముకుని హైదరాబాద్‌ వదిలి మద్రాస్‌ వెళ్దామన్న ఆలోచన ఉండే...