Posts

Showing posts with the label Mynampati Sreeram Chandra(singer)-మైనంపాటి శ్రీరామచంద్ర(గాయకుడు)

Mynampati Sreeram Chandra(singer)-మైనంపాటి శ్రీరామచంద్ర

Image
    పరిచయం (Introduction) : మనోడు అద్దరగ్గొట్టేశాడు.. తన గాన మాధుర్యంతో కోట్లాది భారతీయుల గుండెల్లో చిరుసవ్వడిని మోగించాడు. లయబద్ధంగా తలలూగించాడు. సంగీతానికి సరికొత్త అర్థాన్ని ఆపాదించాడు. నిన్న మొన్నటి ఉత్కంఠతకు తెర దించి ‘ఇండియన్ ఐడల్’ ట్రోఫీతో తొలి దక్షిణాది గాయకుడిగా చరిత్రకెక్కి రికార్డు సృష్టించాడు. ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టాడు. మనోడే. మన తెలుగువాడే. మైనంపాటి శ్రీరామచంద్ర. హైదరాబాద్ బోయిన్‌పల్లి నివాసి. లక్షా ఎనభై వేల మంది పోటీదారులతో తలపడి తెలుగోడు సత్తాని మనసుకి హత్తుకునేలా చేశాడు. మున్నాభాయ్‌ని కంట తడిపెట్టించాడు. అమితాబ్‌తో ‘ఔరా’ అనిపించాడు. అమీర్‌ఖాన్‌తో ‘గ్రేట్..’ అనిపించుకొన్నాడు. ఆగ్రాకి చెందిన రాకేష్ మైనీని, బరోడా భూమి త్రివేదితో పోటీపడి 50 లక్షల ప్రైజ్ మనీతో.. టాటా వింగర్ కారుతో తిరిగొచ్చాడు. సోనీ జీఎంజీతో ఒక సంవత్సరం కాంట్రాక్టు. ‘యాష్‌రాజ్ ఫిల్మ్’ ప్రాజెక్టులో ఆలపించే అవకాశం.. ఇన్ని చేజిక్కించుకుని తెలుగు కీర్తి పతాకను ఎగురవేసి సగర్వంగా సరిగమల గమకాలతో మాట్లాడుతూన్నట్టు.. పాట పాడుతున్నట్టు.. నేనిప్పటికీ కలలోనే ఉన్నానా? అంటూ ప్రశ్నిస్తున్నాడు. కాన...