మార్తాండ్ కె వెంకటేష్ , Marthand K Venkates
పరిచయం : మార్తాండ్ కే వెంకటేష్ మంచి తెలుగు ఫిల్మ్ ఎడిటర్ . ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే , ఒక వైపు కధ బాగుండాలి , రెండోవైపు సినిమా ఎడిటింగ్ బాగుండాలి . ఈయన ఎడిట్ చేసిన సినిమాలు సుమారు అన్నీ బ్లాక్ బస్టర్సె . సుమారు 270 సినిమాలు ఎడిట్ చేసారు . స్టార్లు ఎందరైనా ఉండొచ్చు. స్టార్ డైరెక్టర్లూ ఉండొచ్చు. కానీ, స్టార్ ఎడిటర్లు వేళ్లమీద లెక్కపెట్టగలిగేంతమందే ఉంటారు. అలాంటివాళ్లలో మార్తాండ్ కె వెంకటేష్ ఒకరు. సుప్రసిద్ధ ఎడిటర్ కె.ఎ.మార్తాండ్ తనయుడైన ఆయనకు ఎడిటింగ్ కూడా వారసత్వంగానే వచ్చిందేమో అనిపిస్తుంది ప్రొఫైల్ : పేరు : వెంకటేష్ కె.యం . తండ్రీ : కె.ఎ.మార్తాండ్ , (పేరున్న ఫిల్మ్ ఎడిటర్ )-కాకినాడ అమ్మ : కన్నవారు శ్రీకాకుళం , అంకుల్ : బి.ఎ.సుబ్బా రావు ( తెలుగు ఫిల్మ్ ఎడిటర్ ) తోబుట్టువులు : అక్క , చెల్లి , తమ్ముడు ( మొత్తం నలుగురు). హాబీస్ : టి.వి చూడడం , చదువు : ఇంటర్మీడియట్ + ఫిల్ము ఎడిటింగ్ లో సర్టిఫికేట్ , కెరీర్ : కె.రాఘవేంద్ర రావు " కూలి నెo. 1 సినిమా ఎడిటింగ్ మొదటిగా చేసారు . తన తండ్రి తాగుడికి బానిసై పోవడం వలన ఇంటర్మీడియట్...