నాగేంద్రరావు రట్టహల్లి, Nagendra rao.R
ఫొటొ : ఈనాడు సినిమా దినపత్రిక సౌజన్యము తో . పరిచయం (Introduction) : నాగేంద్రరావు కన్నడ నటుడు. ఐతే ఏం?- తమిళం, తెలుగు కూడా బాగా వచ్చు. 1940లో సుందరరావు నడకర్ణి దర్శకత్వంలో 'భూకైలాస్' చిత్రం వచ్చింది. నటీనటులందరూ కన్నడంవారే. రెండు భాషల్లోనూ వారే మాట్లాడారు. అందులో ఆర్. నాగేంద్రరావు నారదుడిగా నటించారు. సుబ్బయ్య నాయుడు రావణుడు, లక్ష్మీబాయి మండోదరి. ఈ సినిమా రెండు భాషల్లోనూ బాగా నడిచింది. ఆర్.నాగేంద్రరావు తెలుగువారికి ఈ సినిమాలోనే ముందుగా కనిపించారు. 'అపూర్వ సహోదరగళ్' చిత్రానికి సంభాషణలు నాగేంద్రరావే రాశారు. తెలుగులో బలిజేపల్లి లక్ష్మీకాంతం రాశారు. 'అపూర్వ సహోదరులు'లో తమిళ నటులందరికీ - హీరో రాధాతో సహా - గాత్రాలు మార్చారు గాని, నాగేంద్రరావు గారిది సొంతమే. ఎంతో సహజంగా, అద్భుతంగా నటించాడాయన ఆ పాత్రలో. ఆర్.నాగేంద్రరావు- నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, దర్శకుడు, రచయిత, నిర్మాతా- అన్నీ. అన్ని శాఖల్లోనూ ఆయన ప్రజ్ఞావంతుడే. జీవిత విశేషాలు (profile) : పేరు : రట్టిహల్లి ,నాగేంద్రరావు .,(name =Rattihalli , Sirname =nagendrarao), పుట్టిన తేదీ : 23-జూన్-1896, మరణము : x-x...