Srilatha-శ్రీలత(T.V.artist)
పరిచయం (Introduction) : అనుకున్నదొక్కటీ... అయ్యిందొక్కటీ... అయినా అంతా కలిసొచ్చిందిలే శ్రీలతకీ! అవును, కూచిపూడి కళాకారిణిగా పేరు తెచ్చుకోవాలన్న ఆమె కెరీర్‌ను ఒక అవకాశం మలుపు తిప్పింది. ఆ తరవాత పద్మవ్యూహం, ఆడపిల్ల, బంధం, అంతఃపురం, సుమంగళి, ఆటోభారతి వంటి డెబ్బై సీరియళ్లలో నటించిన శ్రీలత మంచి టాలెంట్ ఉన్న టి.వి.కళాకారిణి . జీవిత విశేషాలు (profile) : ఊరు : హుజూరాబాద్- కరీంనగర్ జిల్లా . నాన్న: హైదరాబాద్‌లో నిర్మాణ రంగానికి సంబంధించిన వ్యాపారం. అమ్మ : విజయలక్ష్మి గృహిణి తోబుట్టువులు : అక్క, అన్నయ్య తరవాత నేను. చదువు : డిగ్రీ , కెరీర్ :-- తన మాటల్లో-> చిన్నప్పుడు స్కూల్లో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ మేం పాల్గొని డాన్స్ చేసే వాళ్లం. చూసిన వాళ్లందరూ 'చాలా బాగా చేస్తున్నారు' అనడంతో డాన్స్ అంటే తెలియకుండానే ఇష్టం ఏర్పడింది. 'స్వర్ణకమలం' సినిమాను ఎన్ని సార్లు చూశానో లెక్కే లేదు. దానిలో భానుప్రియలా గొప్ప డాన్సర్‌ను కావాలనుకుని, డి.వి. సత్యకుమార్ దగ్గర కూచిపూడి నృత్యం నేర్చుకున్నా. ప్రదర్శనలివ్వడం ప్రారంభించా. ఒక కార్యక్రమంలో నా డాన్స్ చ...