రామ్ గోపాల్ వర్మ , RamagopalVarma
పరిచయం : రామ్ గోపాల్ వర్మ - ఒక ప్రముఖ తెలుగు, భారతీయ సినిమా దర్శకుడు మరియు నిర్మాత. అతను సాంకేతికంగా పరిణితి చెందిన, మాఫియామరియు హార్రర్ నేపథ్యం కలిగిన చిత్రాలను తీయడంలో సిద్దహస్తుడు. చలనచిత్ర ప్రవేశం తెలుగులో జరిగినా తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలోస్థిరపడ్డాడు. అతనికి పేరు తెచ్చిన చిత్రాలలో ముఖ్యమైనవి శివ (తెలుగు), క్షణ క్షణం (తెలుగు), రంగీలా (హిందీ), సత్య (హిందీ), కంపెనీ (హిందీ) మరియు భూత్ (హిందీ). అతనినిర్మాణ సంస్థ "వర్మ కార్పొరేషన్" పలు చిత్రాలు నిర్మించింది. ప్రొఫైల్ : పుట్టిన తేది : ఏప్రిల్ 7, 1962 పుట్టిన ఊరు: విజయవాడ నగరం తండ్రీ : కృష్ణంరాజు, తల్లి : సూర్యమ్మ, చదువు :నగరంలోని సిధ్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలోఇంజినీరింగ్ విద్యను అభ్యసించాడు. అయితే అతనికి చదువుకన్నా చిత్రరంగం మీదే ఎక్కువ శ్రద్ధ ఉండేది. విద్యార్థిగాఉన్నప్పుడు విడుదలైన ప్రతి చిత్రము, ఏ భాషలోనైనా, వదలకుండా చూసేవాడినని ఆయన చెబుతూ ఉంటారు. తనస్నేహితులతో ప్రతి చిత్రాన్ని విశ్లేషిస్తూ, అందులోని తప్పొప్పుల గురించి వాదనలు జరిపేవాడు. కెరీర్ : ఇంజినీరింగ్ పట్టా పొందినతర్వాత చిత్ర పరిశ్రమలో అవకాశం కోసం ఎదురు...