Posts

Showing posts with the label పి వి దాసు

పి వి దాసు , Dasu P V

Image
పరిచయం : మద్రాసు లో మొట్టమొదటి టాకీ (సౌండ్)స్టూడియో (1934) , వేల్ పిక్చర్ స్టూడియో స్థాపకులు . మద్రాసు లో నిర్మాణమైన మొట్టమొదటి తెలుగు చిత్రం " సీతాకల్యాణం" సినిమా నిర్మాత. ఈ స్టూడియో నెలకొల్పక ముందు మద్రాసు నిర్మాతలు ముంబై ,కలకత్తా , కొల్హాపూర్ , పూణే , తెక్నిశియన్లపై ఆధారపడేవారు . ఈ స్టూడియో ఒక శిక్షనాలయమ్ గా అభివృద్ధి చెంది దక్షిన భారత సాంకేతిక ప్రవీణు ల కొరత చాలావరకు తీర్చింది . 1934 నాటికి పదంటే పది టాకీ చిత్రాలు తయారై ఉన్నాయి. అవన్నీ విజయం సాధించాయి వాటిల్లో కొన్ని అప్పటికే అఖండ విజయం సాధించాయి. అయితే చిత్రమేమిటంటే వాటిల్లో ఏ చిత్రం కూడ తెలుగు నేలపై నిర్మాణానికి నోచుకోలేదు! నా భాష, నా ఊరు, నా నేల... ఇవన్నీ కాలీతీతం! ఏ యుగంలోనైనా అలా భావించేవారు కొందరైనా ఉంటారు. వారే ఎంతోమందికి ప్రతినిధులుగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేస్తారు. సరిగ్గా... ఈ కోవకు చెందినవారే ... పినపాల వెంకటదాసు సంక్షిప్తంగా... పి.వి.దాసు! కృష్ణాజిల్లా సినిమా పంపిణీరంగంలో తొలి విజయాలు చవిచూసిన పంపిణీదారుడు పి.వి.దాసు. రేపల్లె కృష్ణాటాకీసు ఎగ్జిబిటర్‌గా, మచిలీపట్నం మినర్వాటాకీసు భాగస్వామి...