Kannappa(cinema photographer)-కన్నప్ప(ఛాయాగ్రాహకుడు)
పరిచయం (Introduction) : పాత చిత్రాలు బాగా చూసినవాళ్లకి ఛాయాగ్రాహకుడు కన్నప్ప పేరు చిరపరిచితమే. పేరు చూసి ఆయనెవరో కన్నడిగుడు అనుకుంటారు. కానీ, తూర్పు గోదావరి జిల్లావాడు. భక్తకన్నప్ప లాగా కన్నప్ప అని పేరు పెట్టి ఉంటారు పెద్దలు. అతని తండ్రిగారు మద్రాసు వచ్చి స్థిరపడడంతో బాల్యం, చదువూ అంతా మద్రాసులోనే గడిచింది. జీవిత విశేషాలు (profile) : పేరు : కన్నప్ప , ఊరు : తూర్పు గోదావరి జిల్లా , నివాసము : మద్రాస్ , (filmography ): కన్నప్ప ఛాయాగ్రహణం సినిమాలు కొన్ని - సత్యమే జయం, సుఖదుఃఖాలు, రాజయోగం, రాజసింహ, బంగారు పిచిక, జగత్ కిలాడీలు, జగత్ జంత్రీలు, అమ్మమాట, బందిపోటు భీమన్న, కిలాడి సింగన్న, రౌడీ రాణి, హంతకులు - దేవాంతకులు, ఢిల్లీ టు మద్రాస్ (తమిళం), రాణీ మేరానామ్ (హిందీ), పాపం పసివాడు, గుండెలు తీసిన మొనగాడు, తాత-మనవడు, బంగారు మనసులు, దానవీర శూరకర్ణ కెరీర్ :carrer : స్కూల్లో చదువుకుంటున్నప్పట్నుంచి చిన్న కెమెరా పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. స్కూలు పిక్నిక్‌ల్లోనూ, ఆట ప...