దాసరి నారాయణరావు , Narayanarao Dasari
====================================================== పరిచయం: డా. దాసరి నారాయణరావు - రాజకీయనాయకుడు , సినిమా దర్శకుడు మరియు సినీ నిర్మాత. కళాశాలలో చదివేరోజులలో బీ . ఏ డిగ్రీతో పట్టబధ్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవాడు . అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడి గా , నాటక రచయిత గా చిత్ర దర్శకుడి గా గుర్తింపు పొందారు . దాసరి నారాయణరావు దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు . 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు . ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు . దాసరి తెలుగు , తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి , తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు . కృషితో నాస్తి దుర్భిక్షం అనే పదానికి తెలుగుసినీరంగంలో ఉదాహరణగా ఈయన గురించి చెబుతారు . ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డాడు . ఒకానొక సమయంలో ఈయన పేరిట 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవి . ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయన ప్రాచుర్యానికి అద...