రేలంగి వెంకట్రామయ్య,VenkataramayyaRelangi
పరిచయం : రేలంగి వెంకట్రామయ్య తెలుగు చలన చిత్ర పరిశ్రమలో, హాస్యనటులలో పేరెన్నికగన్నవారు. ఇంటిపేరు రేలంగితో ప్రసిద్ది పొందారు. 50 మరియు 60 దశకాలలో రేలంగి లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. అటు క్లాస్‌ని, ఇటు మాస్‌ని నవ్వుల్లో ముంచెత్తిన రేలంగి వెంకట్రామయ్య పెద్దగా చదువుకోలేదు. రంగస్థల నటుడిగా , తబలిస్ట్ గా కొన్నాళ్ళు గడిపారు . వేషాల కోసం తిరుగుతూ, 1935లో కలకత్తా వెడుతున్న 'శ్రీకృష్ణ తులాభారం' చిత్రం యూనిట్లో కలిసిపోయారు. దారిలో అందరితో మంచిగా వ్యవహరిస్తూ కలకత్తా చేరాక ముఖ్యులను పట్టుకుని, యూనిట్‌కి అన్ని రకాలుగా సాయం చేస్తూ, ఆ చిత్రంలో చిన్న వేషం వేశారు. తరువాత దర్శకుడు సి.పుల్లయ్యను వెన్నంటి ఉంటూ, 'ధ్రువ విజయం'లో ఇంద్రుడి పాత్ర సంపాయించుకున్నారు. అలా ఏడేళ్లు అంటే 1942 వరకు అష్టకష్టాలు పడిన తర్వాత ఏలిననాటి శని వదిలి 'బాలనాగమ్మ' చిత్రం మంచి గుర్తింపు తెచ్చింది.ఇక అక్కణ్ణించి హాస్యనటుడుగా ఎదిగిపోతూ, కొన్ని చిత్రాల్లో హీరో లాంటి పాత్రలు, మరికొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్, పౌరాణిక చిత్రాల్లో నారదుడు, లక్ష్మణ కుమారుడు, తది తర పాత్రలు ...