Andrea Jeremiah - ఆండ్రియా జెరేమియా
- పరిచయం (Introduction) : తెలుగులో నాగ చైతన్య సరసన ‘భలే తమ్ముడు’ చిత్రంలో నటీస్తోంది. దీంతో తెలుగునాట కూడా ఆండ్రియామాయ ప్రారంభం కానుంది. తమిళనాడులోని ఒక ఆంగ్లో-ఇండియన్ న్యూక్లియర్ ఫ్యామిలీలో జన్మించిన ఆండ్రియాకు చిన్ననాటి నుంచే కళలన్నా, సాహిత్యమన్నా మక్కువ ఎక్కువ. ఆ ఇష్టంతోనే తొలుత నేపథ్యగాయకురాలిగా తెరంగేట్రం చేసి ఆ తరువాత నటిగా, వాయిస్ యాక్టర్‌గా తమిళ, తెలుగు భాషల్లో తనదైన శైలిలో దూసుకుపోతోంది. - చెనై్నలోని తన బాల్యాన్ని గడిపిన ఆమె కళాశాల విద్యాభ్యాసాన్ని మహిళల క్రిస్టియన్ కళాశాల నుంచి పూర్తి చేసింది. * ఆమె తండ్రి చెనై్న హైకోర్టులో న్యాయవాదిగా మంచి పేరు సంపాదించారు. * పది సంవత్సరాల వయసులోనే జాక్సన్ ఫై స్టైల్ ట్రూప్‌ను పోలిన ‘యంగ్ స్టార్స్’ అనే బృందంలో చేరింది. అక్కడే ఆమె సింగింగ్ కెరీర్ ప్రారంభ మైంది. కళశాల విద్యాభ్యాసం సమయంలోనే రంగస్థల నట ప్రవేశం చేసి పలు డ్రామాలలో నటించింది. * గౌతం మీనన్ చిత్రం ‘వెట్టైయాడు విలైయాడు’ లో ఒక పాట పాడి సినీ కెరీర్‌ను ప్రారంభించింది. వెట్టైయాడు విలైయాడు మంచి విజయం సాధించడంతో అవకాశాలు రావడం మొదలయ్యాయి. అయితే సింగర్‌గా కాదు...