Sandhya Rani (Dubbing Artist)-సంధ్యారాణి(డబ్బింగ్)
గొంతు నుంచి కాళ్ల వరకూ ఎనిమిది శస్త్ర చికిత్సల కత్తిగాట్లు. ఏడేళ్ల పాటు మెదడు ఒక్కటే పనిచేసి శరీరమంతా చచ్చుబడిన చేదు గతం.'వైకల్యం కదా... నువ్వేం సాధిస్తావు' అనే వెక్కిరింతలు. ఇవేవీ ఆ అమ్మాయి సంకల్పాన్ని నీరుకార్చలేదు. ఇంకా చెప్పాలంటే... మరో అడుగు ముందుకేసేలా చేశాయి. సీరియళ్లతో మొదలుపెట్టి, సినిమాలకు డబ్బింగ్ చెప్పే కళాకారిణిగా ఎదిగే స్థాయికి చేర్చాయి. ఆమే సంధ్యారాణి. కష్టాలను దాటిన తీరుని చెబుతున్నారిలా... 'మాయాద్వీపం' గేమ్‌షోలో సాలభంజికలు మాట్లాడినప్పుడూ... 'షిర్డీ సాయి కథ'లో పింకీ మాట్లాడినప్పుడూ మీకు తెరపై కేవలం పాత్రలే కనిపిస్తాయి. కానీ వాటి వెనుక ఉన్న గొంతు నాదే! ఇవేకాదు... అగ్నిపూలూ, శ్రావణ సమీరాలూ, రాధామధు, శ్రావణీ సుబ్రమణ్యం, హ్యాపీడేస్, శిఖరం, కృష్ణావతారాలూ, పోలీస్ డైరీ... ఈ సీరియళ్లు చూసిన వాళ్లకు నా గొంతు కొత్తేం కాదు! 'అరె... ఆ గొంతు ఈ అమ్మాయిదా..' అని అనుకొంటారేమో ఇప్పుడు నా గురించి చదువుతున్న వాళ్లంతా! అయితే చాలామంది నన్ను ఓ వైకల్యం ఉన్న అమ్మాయిగా.. స్టూడియోకి ఎప్పుడూ నాన్న సాయంతో వచ్చే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానే గుర్తు పడత...