Posts

Showing posts with the label Gollapalli Nagabhushanam(bhushan)-గొల్లపల్లి నాగభూషణం (భూషణ్‌)

Gollapalli Nagabhushanam(bhushan)-గొల్లపల్లి నాగభూషణం (భూషణ్‌)

Image
   Gollapalli Nagabhushanam(bhushan)-గొల్లపల్లి నాగభూషణం (భూషణ్‌) --by Ravi kondararao@pathabangaram of eenadu cinema కొందరు కొత్తగా పరిచయమవుతారు. ఆ పరిచయం మైత్రిగా మారి ఎంత దగ్గరయినా- మర్యాదగానే 'మీరు' అని పిలుచుకుంటూ మాట్లాడుకుంటారు. స్నేహం ఎక్కువయితే 'నువ్వు' అనుకునేవాళ్లూ ఉన్నారు. కాని, తొలి పరిచయంలోనే 'మీరు' అని, రెండో రోజునే 'నువ్వు' అనే వాళ్లలో భూషణ్‌ కనిపిస్తాడు. జి.ఎన్‌.భూషణ్‌ చిత్ర ప్రపంచంలో ఎందరికో మిత్రుడు. ఎందరో అతనికి మిత్రులు. స్నేహశీలి. ఫొటోగ్రఫీలో పేరుపొందినవాడు. సినిమా పబ్లిసిటీకి స్టిల్స్‌ ఉపయోగపడతాయి. ఆ స్టిల్స్‌ను అందంగానూ, వైవిధ్యంగానూ తీసి ఇవ్వగలవాళ్లు ఎందరో ఉన్నారు. ''స్టిల్‌ ఫొటోగ్రఫీ కూడా ఒక కళ. మామూలుగా ఫొటోలు తియ్యడంలాంటిది కాదు'' అని చెప్పే భూషణ్‌ ఫొటోగ్రఫీలో బాగా కృషి చేశాడు. ఆ కళకు సంబంధించిన విదేశీయ పుస్తకాలు పత్రికలూ అభ్యసించాడు. మద్రాసులో ఉన్న ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో ఫొటోగ్రాఫర్‌ ఉద్యోగం చేశాడు. మొదటిసారి బాపుగారింట్లో పరిచయమయ్యాడు నాకు. అప్పుడు ఉద్యోగంలో ఉంటూ, పత్రికలకు ఫొటోలు తీసేవాడు. సృజ...