Naveen Gandhi - నవీన్ గాంధీ(cine director)
పరిచయం (Introduction) : ప్రస్తుత తెలుగు చిత్రాల సరళికి భిన్నంగా వెళ్లాలని ఈ కథ సిద్ధం చేసుకున్నా. సాధారణంగా ఇలాంటి సినిమాలు హిందీ, ఆంగ్లంలో వస్తుంటాయి. ఇప్పుడు మన ప్రేక్షకులు ప్రపంచ చిత్రాలు చూస్తున్నారు. అలాంటప్పుడు మనమెందుకు ఆ స్థాయి సినిమాలు చేయకూడదనిపించింది. అలా చేసిన ఆలోచనే ఈ చిత్రం'' అన్నారు నవీన్ గాంధీ. ఆయన దర్శకునిగా రూపొందిన చిత్రం 'గాలిపటం'. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా నవీన్ గాంధీ ఇటీవల హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. ''ఈ సినిమా మన సంస్కృతి సంప్రదాయాలకు దూరంగా ఉందని కొందరంటున్నారు. ఈ మాటను నేను అంగీకరించను. ఎందుకంటే ఈ సినిమా ద్వారా నేను ప్రేమ గొప్పతనాన్ని, అవసరాన్ని చెప్పాను. ఎక్కడా నేల విడిచి సాము చేయలేదు. అందుకే నా ప్రయత్నాన్ని ప్రేక్షకులు మెచ్చుకున్నారు'' అన్నారు. సంపత్ నంది నిర్మాణంలో పనిచేయడం గురించి చెబుతూ ''సంపత్ నందితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు నిర్మాతగా మారితే అతనితో పని చేయడం చాలా సులభం. నిర్మాణరంగంతోపాటు సాంకేతిక విభాగాలపైనా అతనికి పట్టు ఉంటుంది. అందువల్ల సినిమా నిర్మాణం ...