అచ్చిరెడ్డి కె , Atchi Reddy K
పరిచయం : అచ్చి రెడ్డి,కె. మంచి సిని నిర్మాత. ఈయన ప్రాణ మిత్రుడు యస్.వి.కృష్ణా రెడ్డి దర్సకత్వము లో ఎన్నో మంచి చిత్రాలు చరిత్ర సృష్టించాయి . వీరు " చిత్రాంజలి " సినిమా వార పత్రికకు సలహా దారుడు గా వున్నారు. ప్రొఫైల్ : పేరు : అచ్చి రెడ్డి , పుట్టిన తేది : 14 జనవరి , ఊరు :అరవల్లి - వస్ట్ గోదావరి జిల్లా , సినీ రంగ ప్రవేశం : ఒకే ఊరు , క్లాస్ మేట్ , స్ట్రీట్ మేట్ , ప్రాణ స్మేహితుడు అయిన .. యస్ . వి . కృష్ణ రెడ్డి కి నటన అంటే ఎంతో ఇస్తమయి నందున ,, స్నేహితుడు కోసం సినీ నిర్మాత అవ్వాలని డబ్బు సంపాదించడానికి హైదరాబాద్ వచ్చి స్వీట్స్ తయారీ చేసి ఇరానీ హోటల్స్ కి ఇచ్చే వ్యా పరము , తీ పొడి సప్లై వ్యాపారము చేసారు. కొన్ని తమిళ , మలయాళ సినిమాలు డబ్బింగి చేయించి , సినీ ఫీల్డ్ లో అనుభవం సంపాదించి , తొలి గా " కొబ్బరి బొండం " సినిమా తీసేరు,. చేసిన కొన్ని సినిమాలు : కొబ్బరి బొండాం , రాజేంద్రుడు గజేంద్రుడు , యమలీల , మాయాజాలం'. "విక్టరీ. ఘటోత్కచుడు , వినోదం , ఉగాది , దీర్ఘ సుమంగలీభవ , అభిషేకం , (మూలము : స్వాతి వార పత్రిక )