శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)
పరిచయం (Introduction) : ''ఎస్వీ రంగారావు, మోహన్‌బాబు తదితర నటులను స్ఫూర్తిగా తీసుకొన్నాను. వారి నటనను పరిశీలిస్తూనే నాకంటూ ఒక శైలిని ఏర్పాటు చేసుకొన్నాన''ని చెబుతున్నారు శ్రీహరి. సోమవారం ఆయన పుట్టినరోజు. ''ఇప్పటిదాకా 75 చిత్రాల్లో కథానాయకుడిగా నటించాను. ప్రతి సినిమాతోనూ సమాజానికి ఒక మంచి సందేశాన్నిచ్చే ప్రయత్నం చేశాన''ని చెబుతున్న శ్రీహరి ఇటీవల పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విషయాలివీ... * ''ప్రతి యేడాదీ ఒక విజయం మధ్య పుట్టినరోజును జరుపుకోవడం అలవాటు. ఈ సారి అలా చెప్పుకోదగ్గ విజయమేదీ దక్కలేదు. అయినా ఫర్వాలేదు. అప్పుడప్పుడు పరాజయాలు పలకరిస్తుంటేనే విజయం విలువేమిటో తెలుస్తుంటుంది. గతేడాది నేను చేసిన 'డాన్ శీను', 'బృందావనం', 'అహనా పెళ్ళంట' చిత్రాలు తృప్తినిచ్చాయి''. * ''బ్రహ్మనాయుడు' చిత్రంతో తెరప్రవేశం చేశాను. 23 యేళ్ల నట జీవితంలో ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, సహాయనటుడిగా, కథానాయకుడిగా.. ఇలా ఎన్నో రకాల పాత్రలు పోషించాను. ఒక రకంగా చెప్పాలంటే రెండేళ్లకో మలుపు తీసుకొంది కెరీర్. అందివచ్చిన ప...