త్రిపురనేని గోపీచంద్ , Gopichand.T(Writer)
పరిచయం : త్రిపురనేని గోపీచంద్ ప్రముఖ తెలుగు రచయిత , హేతువాది, సాహితీవేత్త మరియు తెలుగు సినిమా దర్శకుడు. ఈయన తండ్రి ప్రముఖ సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి. గోపీచంద్ తన జీవితంలో చాలా సంఘర్షణను అనుభవించాడు.అనేక వాదాలతో వివాదపడుతూ, తత్వాలతో దాగుడుమూతలాడుతూ, సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్నే అనుభవిస్తూ జీవయాత్ర కొనసాగించాడు. తన తండ్రినుంచి గోపీచంద్ పొందిన గొప్ప ఆయుధం,ఆస్తి,శక్తి ఎందుకు? అన్న ప్రశ్న. అది అతన్ని నిరంతరం పరిణామానికి గురిచేసిన శక్తి. అతనిలోని అరుదైన, అపురూపమైన, నిత్యనూతనమైన అన్వేషణాశీలతకి ఆధారం. ఎందుకు? అన్న ప్రశ్ననే అతన్ని ఒక జిజ్ఞాసువుగా,తత్వవేత్తగా నిలబెట్టింది. ఈ క్రమంలో అతనిలో చెలరేగిన సంఘర్షణ అతని నవలలన్నింటిలోనూ ప్రతిఫలించింది. గోపీచంద్ రచనలలో విలువల మధ్య పోరాటం ముఖ్యముగా చెప్పుకోతగినది. ఆయన రాసిన అసమర్థుని జీవయాత్రతెలుగులో మొదటి మనో వైజ్ఞానిక నవల. 1963లో పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా కు కేంద్ర సాహిత్య అకాడమీఅవార్డు వచ్చింది. జీవిత క్రమం : ప్రొఫైల్ : పుట్టిన తేది: సెప్టెంబర్-1910 నాడు గోపీచంద్ జన్మించాడు. తండ్రి, : త్రిపురనేని రామస్వామి చ...