గాయత్రి-Gayatri
========================================= పరిచయ ము : బాలనటిగా తమిళంలో పాతిక చిత్రాల దాకా చేసిన గాయత్రి ఇటీవల తెలుగు తెరకూ పరిచయమైంది . ' నోట్ బుక్ ' తో .. పదహారణాల పల్లెటూరి పడుచులా .. బుంగమూతి పెడుతూ .. అల్లరి చేస్తూ ... పరికిణీలో పసిడిబొమ్మలా కనిపించిన గాయత్రి అచ్చతెనుగమ్మాయి . రావులపాళెం పక్కన ఓ పల్లెటూరు . ఇక్కడ నుంచి అక్కడికెళ్లిన ఫ్యామిలీ . తెలుగే . గాయత్రి ఒక్కటే అమ్మాయి . టీవీ సీరియల్స్ , సినిమాల్లో బాలనటిగా పరిచయమైన అచ్చతెనుగు అమ్మాయి గాయత్రి . ఈమె తమ నటన ద్వారా తెలుగు సినీరంగంలో ప్రత్యేక స్థానం నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇటీవల విడుదలైన ' నోట్ బుక్ ' సినిమాలో హీరోయిన్ గా పరిచయమైంది . ' నాగమ్మ ' సీరియల్ గాయత్రికి గొప్ప పేరును సంపాదించి పెట్టిన తరుణంలో హీరోయిన్ గా రంగంలోకి దిగటం ఆమె నటనకు ప్రతీకారం . నోట్ బుక్ చిత్రానికి అనంతరం కొత్తగా ఈమె తీస్తున్న చిత్రం ' సంధ్య '. ఈ చిత్రంలో బాలాదిత్య చెంతన హీరోయిన్ పాత్రలో నటిస్తోంది . ఆమెతో మాటా మంతి .... ప్రొఫైల్ : పేరు : గాయత్రి ఊర...